Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Suvaartha Andhani Ooru Undaney Koodadu

సువార్త అందని ఊరు ఉండనే కూడదు

Suvaartha Andhani Ooru Undaney Koodadu

Lyricist: Dr K John Mangacharyulu
Verse
సువార్త అందని ఊరు ఉండనే కూడదు
సంఘము లేని గ్రామం అసలుండకూడదు
ఇదే ఇదే ఇదే మా లక్ష్యం
ఇదే ఇదే ఇదే మా ఆశయం
ఈ లక్ష్యసాధనలో నే లక్ష్యపెట్టను నా ప్రాణం
సిలువను మోయుచు శ్రమలు సహించుచు
సాగెదను మునుముందుకు చాటెదను సువార్తను
పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను
నిందలైన మోస్తాగాని నీతినెపుడు విడువను నేను
సాగెదను మునుముందుకు చాటెదను సువార్తను
యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా
నిండుగా మనకండగా కొండగా తానుండగా
సాగెదను మునుముందుకు చాటెదను సువార్తను

Related Tags

EvangelismDedicationMission