Verse
అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Verse
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
Chorus
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Verse
జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె‖ ఇకనైనా ‖
Verse
అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు‖ ఇకనైనా ‖
Verse
జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం‖ ఇకనైనా ‖
Verse
సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…
Verse
బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా‖ ఇకనైనా ‖