Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Svaasthyamugaa Nichchithivi Jayimchedu Vaanikanni

స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని

Svaasthyamugaa Nichchithivi Jayimchedu Vaanikanni

Chorus
స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని
Verse
నీవే మాకు దేవుడవై యున్నావు
మేము నీదు పుత్రులమైతిమి
నీ స్వంత రక్తము నిచ్చి
కొన్నావు నీ సొత్తుగా
Verse
నిన్నంగీకరించిన వారలందరిని
నీ నామమందు నమ్మిన వారిన్
నీ పిల్లలుగాను జేసి
అధికారమిచ్చితివి
Verse
నీతో కూడా మహిమను పొందుటకు
నీ శ్రమలలో పాలు పొందుటచే
నీ తోటి వారసులముగా
పరిగణింపబడితిమి
Verse
అక్షయమైన నిర్మలమైనదియు
వాడబారని స్వాస్థ్యము కొరకై
మరల జన్మింపగా జేసి
స్థిరముగా నుంచితివి
Verse
నీ శాసనములు హృదయానందములు
అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా
భావించి నిలిచి యున్నాము
హల్లెలూయ గీతములతో

Related Tags

SalvationVictoryInheritance