Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Svachchhanda Seeyonuvaasi Sarvaadhikaari Kasturi Pooraasi

స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి

Svachchhanda Seeyonuvaasi Sarvaadhikaari Kasturi Pooraasi

Verse
స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసి
Verse
వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి
అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే
Verse
ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్
నీ ప్రజలందరి యెదుట
పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే
లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు
Verse
సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్
దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్
Verse
నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో
సువర్ణ శునీయముల - సూర్యకాంతముతో
ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను
Verse
సుమముల హారము - సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రమును నీదే - ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదే
హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే
Verse
జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను
నీతోడై యుండెదను - నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు
Verse
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలను
విడగొట్టెదను నేను - అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులను
రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను
Verse
గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన
కూర్చుండినది మొదలు - నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా
ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే

Related Tags

PraiseWorshipZion