Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Swachchanda Seeyonu Vaasi

స్వఛ్చంద సీయోను వాసి

Swachchanda Seeyonu Vaasi

Lyricist: Songs Of Zion
Verse
స్వఛ్చంద సీయోను వాసి
సర్వాధికారి – కస్తూరి పూరాసి‖ 2x ‖
వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి‖ 2x ‖
అల్ఫా ఒమేగ తానే‖ 2x ‖
ఆద్యంతము మన యేసే‖ 2x స్వఛ్చంద ‖
Verse
ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట‖ 2x ‖
పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే‖ 2x ‖
లెక్క లేని యద్భుతముల్‖ 2x ‖
మక్కువతో చేయువాడు‖ 2x స్వఛ్చంద ‖
Verse
సంగీతం నాదముల తోడ
సీయోను పురము – సొంపుగను చేరితిమి‖ 2x ‖
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్‖ 2x ‖
దుఃఖము నిట్టూర్పును పోయెన్‖ 2x ‖
మిక్కిలి ఆనందము కల్గెన్‖ 2x స్వఛ్చంద ‖
Verse
నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో – మాణిక్య మణులతో‖ 2x ‖
సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో‖ 2x ‖
ప్రశస్త రత్నములతో‖ 2x ‖
ప్రవిమలముగా నిను గట్టెదను‖ 2x స్వఛ్చంద ‖
Verse
సుమముల హారము
సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే‖ 2x ‖
ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే‖ 2x ‖
హిత వత్సరము విముక్తి‖ 2x ‖
ఆత్మాభిషేకము నీదే‖ 2x స్వఛ్చంద ‖
Verse
జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను – నీ తోడై యుండెదను‖ 2x ‖
నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు‖ 2x ‖
అగ్ని మధ్యను నడచినను‖ 2x ‖
జ్వాలలు నిను కాల్చగ లేవు‖ 2x స్వఛ్చంద ‖
Verse
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
నినుప ఘడియలను – విడగొట్టెదను నేను‖ 2x ‖
అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను‖ 2x ‖
రహస్యములో మరుగైన‖ 2x ‖
ధనమును నీ కొసంగెదను‖ 2x స్వఛ్చంద ‖
Verse
గర్భమున పుట్టినది మొదలు
తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు‖ 2x ‖
నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా‖ 2x ‖
ముదిమి వచ్చుఁ వరకు నిన్ను‖ 2x ‖
ఎత్తుకొను వాడను నేనే‖ 2x స్వఛ్చంద ‖

Related Tags

PraiseWorshipZion