Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Swanthathra Raajyam Prabhuraajyam

స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం

Swanthathra Raajyam Prabhuraajyam

Lyricist: E D Nithyanandamu
Chorus
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ
రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం‖ స్వతంత్ర ‖
Verse
ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం
చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం‖ స్వతంత్ర ‖
Verse
మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్
యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్‖ స్వతంత్ర ‖
Verse
సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్
ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్‖ స్వతంత్ర ‖
Verse
నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల
బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం‖ స్వతంత్ర ‖
Verse
జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్
దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్‖ స్వతంత్ర ‖

Related Tags

HeavenEternal LifeKingdom Of God