Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sweekarinchumayaa Naathaa

స్వీకరించుమయా నాథా

Sweekarinchumayaa Naathaa

Verse
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు‖ స్వీకరించుమయా ‖
Verse
నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని‖ 2x ‖
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా‖ స్వీకరించుమయా ‖
Verse
సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి‖ 2x ‖
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా‖ స్వీకరించుమయా ‖

Related Tags

ThanksgivingDedicationOffering