Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Taamasamu Cheyakumu Tharunamunu Veedakumu

తామసము చేయకుము తరుణమును వీడకుము

Taamasamu Cheyakumu Tharunamunu Veedakumu

Verse 1
Reference: దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి యెషయా Isaiah 55:1
Verse
ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరా
రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను
Chorus
తామసము చేయకుము - తరుణమును వీడకుము
కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను
Verse
ఉన్న పాటున రము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడు
సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ
Verse
రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు
పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్
Verse
పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు
సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు
Verse
వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు
సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను
Verse
యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా
యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు
Verse
హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలన
నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్

Related Tags

InvitationRepentanceSalvation