Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Taara Joopina Maargamade

తార జూపిన మార్గమదే

Taara Joopina Maargamade

Verse
తార జూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే
Chorus
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది‖ 2x ‖
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
Verse
తార జూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే‖ 2x ‖
Chorus
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది
పరలోక సైన్యము పాడినది‖ 2x ‖
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Verse
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ‖ 2x ‖
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ..
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Verse
తార జూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే
Chorus
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది
పరలోక సైన్యము పాడినది‖ 2x ‖
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Verse
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడై పుడమి చేరెగా‖ 2x ‖
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ..
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Verse
తార జూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే
Chorus
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది
పరలోక సైన్యము పాడినది‖ 2x ‖
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Verse
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా‖ 2x ‖
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ..
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Verse
తార జూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే
Chorus
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది
పరలోక సైన్యము పాడినది‖ 2x ‖
Chorus
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..

Related Tags

SalvationChristmasNativity