Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Taara Velisindhi Aa Ningilo Dharani Murisindhi

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది

Taara Velisindhi Aa Ningilo Dharani Murisindhi

Verse
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది‖ 2x ‖
రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని‖ 2x ‖
Verse
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే
ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే‖ 2x ‖
సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే
Verse
బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే‖ 2x ‖
మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే

Related Tags

WorshipChristmasNativity