Verse
తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ
జలజల జల రాలును కృతజ్ఞతా కన్నీళ్ళ
తలుచుకొంటే చాలును కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము ఇది కల్వరి స్వరము
Verse
నీ మోమున ఊసిన ఉమ్ములు
నా మోహపు చూపు తుడిచెను
నీ చెంపను కొట్టిన దెబ్బలు
నా నోటిని శుద్ధి చేసెను‖ 2x ‖
నీ శిరస్సున గుచ్చిన ముండ్లు
నా మోసపు తలపును త్రుంచెను‖ 2x ‖
ఎంత త్యాగపూరితమో నీప్రేమా...
ఎంత క్షమాభరితమో నీప్రేమా…
Verse
నీ దేహము చీరిన కొరడా
నా కామమును చీల్చెను
నీ చేతుల కాళ్లకు మేకులు
నా చీకటి దారి మూసెను‖ 2x ‖
సిలువ నెత్తుటి ధారలు
నా కలుషమును కడిగి వేసెను‖ 2x ‖
ఎంత త్యాగపూరితమో నీప్రేమా...
ఎంత క్షమాభరితమో నీ ప్రేమా…