Verse
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చువరకు ఎత్తుకుని ముద్దాడును
చంకబెట్టుకొని కాపాడును యేసయ్యా
Verse
తల్లియైన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను‖ 2x ‖
నీ పాదము తొట్రిల్లనియ్యను నేను నిన్ను కాపాడువాడు
కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్య
Verse
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్ని
వీడిపోదు నా కృప నిన్ను నా నిబంధన తొలగదు‖ 2x ‖
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్య