Verse
తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ
అనురాగంతో ఒకటవ్వాలని
అనుకున్నవన్నీ నిజమవ్వాలని
ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
దీవిస్తూ శుభముగ మీ పరిణయం
Verse
ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురు నిలచింది
చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది
కలకాలం మీరు కలసి ఉండాలని
చిరజీవం మీపై నిలిచి ఉండాలని
Verse
త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది
అరమరికలు లేక ఒకటి కావాలని
పరలోక తండ్రికి మహిమ తేవాలని