Verse
తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నది
కాలము సంపుర్ణమౌతున్నాది‖ 2x ‖
కృపకాలమంతమొందక ముందే
క్రిస్తు యేసుని మనసారా వేడుకో‖ 2x ‖
Verse
లెక్కింపబడును నీ దినకార్యములన్నియు
లిఖింపబడును పరలోకమందునా‖ 2x ‖
తప్పింప తరము కాదు ఎవరికి ఇలాలో
తప్పదు మరణించిన తిర్పు పోందుట‖ 2x ‖
Verse
తులతూగును త్రాసులో నీ స్థితి గతులు
తేలికై పోయినచో తప్పదు నరకం‖ 2x ‖
రహస్య పాపాలైన వ్రాయును లెక్కలో
నశింపకుండునట్లు ప్రభుని వేడుమా‖ 2x ‖
Verse
ప్రతివారి తరుపునా ప్రతివాదిగా
క్షమించమని క్రీస్తు తండ్రిని వేడున్‖ 2x ‖
పరలోక మందు జీవగ్రంధములో
నిపేరు ఉండునట్లు ప్రభుని వేడుమా‖ 2x ‖