Verse
తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడి
విజయులుగా యిలలో ఉజ్జీవము నొందుడి
అ.ప. ఉజ్జీవము నొందుడి జయ ధ్వని చేయుడి
శుభవార్త చాటుడి స్తొత్రార్పణనర్పించుడి‖ 2x ‖
Verse
నలిగిన నిన్ను లేవనెత్తున్
నీటి యూటగ చేయున్
భావి తరాలకు నాందిగా చేయున్
లెమ్ము తేజరిల్లుము‖ 2x ‖
శోధనలో పడకుండునట్లు‖ 2x ‖
ప్రభునకు సర్వ౦ అర్పించుము
Verse
భారము మోసెడి తన ప్రియసుతులకు
యేసుడు నెమ్మది నిచ్చున్
కన్నీరు కారే నీ కన్నులను
ప్రేమతో తుడిచి హత్తుకొనున్‖ 2x ‖
స్థిరపరచి హెచ్చించును‖ 2x హొసన్ననుచూ పాడుడి ‖
Verse
ఏ ఘడియైన వరుడు శ్రీయేసు
మేఘారూఢుడై రానుండె
ఆకాశమందాయనను సంధింప
యేసుతో నేగ ఆయత్తమా?‖ 2x ‖
జీవకీరీటము పొందెదము‖ 2x ‖
క్రీస్తుని పోలి యుందుము