Chorus
తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా‖ 2x ‖
తేజోవాసుల స్వాస్థ్యమందు
Verse
అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము‖ 2x ‖
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా‖ 2x తేజో ‖
Verse
రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం‖ 2x ‖
కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా‖ 2x తేజో ‖
Verse
శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము‖ 2x ‖
శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా‖ 2x తేజో ‖
Verse
నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం‖ 2x ‖
అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా‖ 2x తేజో ‖