Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Teruvu Nee Hrudaya Dwarambu Nede Prabhuyesunande Rakshana Kaladu

తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసునందే రక్షణ కలదు

Teruvu Nee Hrudaya Dwarambu Nede Prabhuyesunande Rakshana Kaladu

Verse
తెరువు నీ హృదయ ద్వారంబు నేడే
ప్రభుయేసునందే రక్షణ కలదు
నిర్లక్ష్యముగా జీవించనేల‖ 2x ‖
వేచియున్నది తీర్పు నీ కొరకై
పరమున కేగుట కాయత్తపడుము
తెరువు నీ హృదయంబును
Verse
జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు
కామ, క్రోధ, లోభ, మోహ, పాపపు డాగులివియే
Verse
ధర్మకర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్న దాగవు
నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమి లేదు
Verse
తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా
పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు?
Verse
పాపమువలన నీ జీవితమును నష్టపరచుకొందువా?
భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము
Verse
పాపపు శిక్ష నీదై యుండ నిన్ను రక్షింపనెంచె
సిలువ శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా
Verse
ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడు
తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదవు

Related Tags

InvitationGospelSalvation