Chorus
తార చూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది
ఆహా హల్లేలూయ ఆహా హల్లేలూయ
తార చూపిన మార్గమదే
జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే
లోక రక్షకుని గూర్చినదే
ఇమ్మానుయేలు జననమది
పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది
పరలోక సైన్యము పాడినది
Verse
దైవాజ్ఞను ధిక్కరించుటయే
పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా
నిండిపోయెను సోదరి
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరి
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
Verse
దైవచిత్తము నెరవేర్చుటకే
క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై
పావనుడే పుడమి చేరగా
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరి
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
Verse
దైవవాక్యము భోదించుటకు
పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే
ఆదరణకర్త కార్యమాయెగా
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరి
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా