Verse
తార వెలిసెను చూడు ఆకాశంలోన
రక్షణ పుట్టెను నేడు క్రిస్మస్ కాంతిలోన
మహా అద్భుతము జరిగెను ఈ భువిలోనా
వినిపించెను సువర్తమానము ఈ ప్రపంచానా
Chorus
Happy Happy Christmas……
Merry Merry Christmas……
Verse
సంతోషంతో ఆనందంతో
ప్రభువుని పూజించుదాం ఆరాధించుదాం
అందరు రండీ సందడి చేద్దాం….
Verse
బెత్లెహేము పురములో – ఆ పశువుల పాకలో
రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఉదయించెను మన కోసము‖ 2x ‖
సర్వపాప పరిహార్ధమగుటకు పాపులను రక్షించుటకు పుట్టినాడని తెలిపింది ఆ గొప్ప మహతార.‖ 2x ‖
గొల్లలు జ్ఞానులు వచ్చిరి – ప్రభువును పూజించిరి
బంగారు సాంబ్రాణి భోళముతో ఆరాధించిరి‖ 2x ‖
మహిమ వెలుగుతో బాల యేసుడు పరుండియుండుట చూచిరి – ఎంత ధన్యత చేసుకొంటిరో ఆ గొల్లలు జ్ఞానులు‖ 2x ‖