Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thaara Velisenu Ee Vela

తారా వెలిసెను ఈ వేళ

Thaara Velisenu Ee Vela

Lyricist: Sayaram Gattu
Verse
తారా వెలిసెను ఈ వేళ
యేసు పుట్టిన శుభవేళ‖ 2x ‖
వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం
తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం‖ 2x ‖
రండి వార్తను చాటుదాము
ఆ రక్షణను పంచుదాము‖ 2x తారా ‖
Verse
పశుల పాకే పావనమాయె
మంద గొల్లలే తన వారాయె‖ 2x ‖
జ్ఞానులొచ్చిరి ఆరాధింప
రాజులలో భీతిని నింప‖ 2x తారా ‖
Verse
పాపమెరుగని నీతి పరుడు
లోకమును కాచే రక్షకుడు‖ 2x ‖
కన్య మరియా గర్భమున
పుట్టెను దేవుని అంశమున‖ 2x తారా ‖
Verse
రాజులకు రాజైన తనకు
ఇచ్చుటకు ఏమున్నది మనకు‖ 2x ‖
వెండి బంగారముల కన్నా
హృదములనర్పిస్తే మిన్నా‖ 2x తారా ‖

Related Tags

WorshipChristmasNativity