Verse
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది‖ 2x ‖
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని‖ 2x తార ‖
Verse
మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే‖ 2x ‖
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే‖ తార ‖
Verse
బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే‖ 2x ‖
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే‖ తార ‖