Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thalavanchaku Nesthama

తలవంచకు నేస్తమా

Thalavanchaku Nesthama

Lyricist: John Wesly
Verse
తలవంచకు నేస్తమా‖ 2x ‖
తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ.. మాదిరి
నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ
నీవు మండాలి ఓ.. జ్వాలగా
నీవు చేరాలి ఓ.. గమ్యము‖ తలవంచకు ‖
Verse
చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే
క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే‖ 2x నీవు ‖
Verse
పెకిలించు కొండలను – విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో
యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో‖ 2x నీవు ‖

Related Tags

FaithEncouragementStrength