Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thalavanchaku Nesthama Thalavanchaku Nesthama

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

Thalavanchaku Nesthama Thalavanchaku Nesthama

Verse 1
తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ మాదిరి
నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండాలి ఓ జ్వాలగా
నీవు చేరాలి ఓ గమ్యము
Verse
చీకటిని వెనుకకు త్రోసి సాగిపోముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే‖ తలవంచకు ‖
Verse
పెకలించు కొండలను విశ్వాస బాటలొ
గెలవాలి యుద్ధ రంగంలో దైవిక బలముతో
యేసుని కృప నీలోనే ఉంది సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో‖ తలవంచకు ‖

Related Tags

FaithEncouragementChristian Life