Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thalli Thana Biddanu

తల్లి తన బిడ్డను

Thalli Thana Biddanu

Verse
తల్లి తన బిడ్డను మరచినా గాని
మరువదయ్యా నీ ప్రేమ నన్ను
పర్వతములు తొలగినా గాని
విడువదయ్యా నీ కృప నన్ను‖ 2x ‖
దుఃఖ దినములే దరి చేరినా
దారి కానక నే చెదరినా‖ 2x ‖
మరువదయ్యా నీ ప్రేమ నన్ను
విడువదయ్యా నీ కృప నన్ను‖ తల్లి ‖
నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావు
పాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు‖ 2x ‖
నీతిమంతుని కొరకైననూ
ఒకరు చనిపోవుట అరుదుగా‖ 2x ‖
ఏ మంచియు లేనట్టి నాకై
ఎందుకయ్యా నీ త్యాగము‖ 2x దుఃఖ దినములే ‖
దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగాను
కాపరివైన నిన్ను కాదని వేసారినాను‖ 2x ‖
నీవు చేసిన మేళ్లన్ని మరచి
దూరమైతిని నిను నేను విడచి‖ 2x ‖
అయిననూ నా రాక కొరకై
వేచియుంటివా ఓ జాలి హృదయా‖ 2x దుఃఖ దినములే ‖

Related Tags

GraceComfortGods Love