Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thallikunnadhaa Thandrikunnadhaa Nee Prema Jaali Yesayyaa

తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా

Thallikunnadhaa Thandrikunnadhaa Nee Prema Jaali Yesayyaa

Verse
తల్లికున్నదా - తండ్రికున్నదా - నీ ప్రేమ జాలి యేసయ్యా..
అన్నదమ్ములకైనా - కన్నబిడ్డలకైనా - నీ ప్రేమ లేదు యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..
Verse
ఏ యోగ్యత లేదనుచూ నా అనువారే - ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా..
రోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ - అవహేళన చేసితిరి బంధువులయ్యా..
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే - నా పరమవైద్యుడ నీవయ్యా..
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..
Verse
ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి - నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా..
జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా - మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి..
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే - నా మంచి కాపరి నీవయ్యా..
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..

Related Tags

GraceJesusLove