Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thallilaa Laalinchunu

తల్లిలా లాలించును

Thallilaa Laalinchunu

Verse
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును‖ 2x ‖
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా‖ తల్లిలా ‖
Verse
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను‖ 2x ‖
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య‖ తల్లిలా ‖
Verse
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు‖ 2x ‖
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య‖ తల్లిలా ‖

Related Tags

PraiseComfortGods Love