Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thama Devuneruguvaaru

తమ దేవునెరుగువారు

Thama Devuneruguvaaru

Lyricist: Songs Of Zion
Verse
తమ దేవునెరుగువారు చేసెదరు
శక్తితో గొప్ప కార్యములు‖ 2x ‖
Verse
ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరు‖ 2x ‖
తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు‖ 2x తమ ‖
Verse
సత్యమును విడువరు – ఉత్తములుగా నడిచెదరు‖ 2x ‖
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు‖ 2x తమ ‖
Verse
మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరు‖ 2x ‖
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు‖ 2x తమ ‖
Verse
ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించినను‖ 2x ‖
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు‖ 2x తమ ‖
Verse
అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగినను‖ 2x ‖
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు‖ 2x తమ ‖
Verse
శోధనలను జయించెదరు – బాధలను సహించెదరు‖ 2x ‖
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు‖ 2x తమ ‖
Verse
అదిక జ్ఞానమును పొంది – తగ్గించుకొనెదరు తామే‖ 2x ‖
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు‖ 2x తమ ‖

Related Tags

CommitmentFaithTruth