Verse
తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు Daniel 11:32
Chorus
తమ దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు
Verse
ఇచ్చకపు మాటల వలన - అక్షయుని విడువరు
తప్పుబోధల నెపుడు తృణీకరించెదరు
Verse
సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు
Verse
మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు
Verse
ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు
Verse
అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు
Verse
శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు
Verse
అదిక జ్ఞానమును పొంది - తగ్గించె కొనెదరు తామే
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు