Verse
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే‖ 2x తంబుర ‖
Verse
పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని‖ 2x తంబుర ‖
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే
Verse
ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా‖ 2x తంబుర ‖
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా