Verse 1
Reference: సితారతోను ... తంబురతోను ఆయనను స్తుతించుడి కీర్తన Psalm 150:3-4
Chorus
తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము
తన నివాసముగ - మమ్ము సృష్టించిన
నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము
Verse
ఆది ఆదాము - మరణ శాసనము
మా శరీరమున్ - ఏలుచుండగా
అమరుడవై ప్రభూ - భువికేతెంచి
మరణపు ముల్లు విరిచి - మరణమున్
గెలిచిన మా ప్రభువా‖ 2x ‖
Verse
పాపము నుండి - చీకటి నుండి
ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి
తన ఆలయముగ చేసిన ప్రభుకు
స్తుతి మహిమ - ఘనత
సీయోనులో అర్పించెదమెప్పుడు
Verse
పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి
నరకపు శిక్ష - తొలగించె మానుండి
పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ
నిర్మించెను యిలలో - గృహముగా
తన ఆత్మ ద్వారా
Verse
ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది
సజీవమైన రాళ్ళే ప్రజలు
ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి
ఆద్యంతరహితుడై - నడుపును
మోక్షపురికి మమ్ము
Verse
మన్నయినది - వెనుకటివలెనే
మరల భూమికి తప్పక చేరున్
మానవ సంపద - కీర్తి మహిమలు
గతించి పోవునిల సీయోను
మరువకు నీ ప్రభుని
Verse
లెబానోను వీడి - నాతోరమ్ము
లోకపు ఆశలు గతించిపోవును
హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు
హెబ్రోను చేరుదము
ప్రభువును ఆరాధించెదము