Verse 1
తంబుర సితారతో మా ప్రభుని - ఆరాదించెనుతన నివాసముగ -
తన నివాసముగ - మము సృష్టించిన
నాధుని పొగడెదము స్తుతి - గానము చేసెదము‖ తంబుర ‖
Verse
పాపమునుండి, చీకటినుండి – ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి‖ 2x ‖
తన ఆలయముగ - చేసిన ప్రభుకు‖ 2x ‖
స్తుతి మహిమ ఘనత - సీయోనులో అర్పిoచెదనిపుడు‖ 2x తంబుర ‖
Verse
ఆది ఆదాము, మరణ శాసనం - మా శరీరము, ఏలుచుండగ‖ 2x ‖
అమరుడవై ప్రభు - భువికేతెంచి‖ 2x ‖
మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా‖ 2x తంబుర ‖
Verse
ఆత్మీయ ఇంటికి, క్రీస్తు పునాది – సజీవమైన, రాళ్ళే ప్రజలు‖ 2x ‖
ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి‖ 2x ‖
ఆద్యంత రహితుడై నడుపును - మోక్షపురికి మమ్ము‖ 2x తంబుర ‖