Verse
తన రాజ్యమునకు మహిమకు పిలచిన‖ 2x ‖
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
తన రాజ్యములో మనము చేరెదము
Verse
కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము‖ 2x ‖
మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము‖ 2x ‖
Verse
ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును
Verse
ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును
Verse
దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు
Verse
విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము