Verse
తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చె బాలునిగా
ఆకాశంలో దూతలు పాడే
భూమి అంతా సంబరమయే
సింహాసనమే వదిలాడయ్యా
మనుష రూపము దాల్చి వచ్చాడయ్య
Verse
కోరి వచ్చెను కారణ జన్ముడే
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే
Verse
నశించిపోవుట తనకు ఒప్పనొల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య
రాజు మారెను దాసుని గాను చేసికొనెను రిక్తునిగాను
పశుల పాకలో పరుండినాడయ్యా
నీ కొరకు నా కొరకు మన మెస్సయ్యా
తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా
మనకై పుట్టెను ఇలలో రేడు రక్షణ వచ్చెను
మన ఇంటికి నేడు
సంతోషమునే నింపాడయ్యా
మన బ్రతుకులలో ఆ మెసయ్యా