Chorus
తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే
యను శక్తి నీయుమీ‖ తనువు ‖
Verse
ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త
వినయ పాదము లివిగో‖ తనువు ‖
Verse
స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి
పూర్ణముగ నింపు‖ తనువు ‖
Verse
వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ
జ్ఞానం బిదిగో‖ తనువు ‖
Verse
నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ
కీయ సింహాసనమౌ‖ తనువు ‖
Verse
ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను
నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ
నుండెదఁ‖ తనువు ‖