Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thanuvu Naa Didigo

తనువు నా దిదిగో

Thanuvu Naa Didigo

Lyricist: Mungamuri Devadasu
Verse
తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు – దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ‖ తనువు ‖
Verse
ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో‖ తనువు ‖
Verse
స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు‖ తనువు ‖
Verse
వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున
మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో‖ తనువు ‖
Verse
నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది
నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ
కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ‖ తనువు ‖
Verse
ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్
నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు
చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద‖ తనువు ‖

Related Tags

PrayerDedicationOffering