Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thappipoyina Kumaarudanayya

తప్పిపోయిన కుమారుడనయ్యా

Thappipoyina Kumaarudanayya

Chorus
తప్పిపోయిన కుమారుడనయ్యా
తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా
కాదనకయ్యా నా కన్న తండ్రి
తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా‖ 2x ‖
Verse
అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని
పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని‖ 2x ‖
ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా
ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా‖ 2x కాదనకయ్యా ‖
Verse
పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు
పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు‖ 2x ‖
ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా
తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా‖ 2x కాదనకయ్యా ‖

Related Tags

GraceRepentanceProdigal Son