Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Tharamulu Maaruchunnavi

తరములు మారుచున్నవి

Tharamulu Maaruchunnavi

Lyricist: P Srinivas
Verse
తరములు మారుచున్నవి.. దినములు మారుచున్నవి..
క్షణములు మారుచున్నాను.. గుణములు మారవెందుకు?
వస్త్రములు మారుచున్నవి.. వృత్తులు మారుచున్నవి..
భాషలు మారుచున్ననూ.. బ్రతుకులు మారవెందుకు?
దేహములు మారుచున్నవి.. ఆహారం మారుతున్నది..
అంతా మారినా గాని.. ఆలోచన మారదెందుకు?
మార్పు చెందరెందుకు?‖ తరములు ‖
Verse
సంద్రంలో ఉన్న రాళ్లను చూడు
అలల తాకిడికి కరిగిపోవును
శిఖరముపై ఉన్న మంచును చూడు
సూర్యుని వేడిమికి కరిగిపోవును‖ 2x ‖
ప్రభువును నమ్మిన ప్రజలను చూడు‖ 2x ‖
దేవుని మాటలకు కరగరెందుకు?
బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?
సంఘముకు వెళ్తూ ఉన్నా.. సత్యము వినుచూ ఉన్నా..
నిత్యము తెలుసుకున్ననూ.. నీతిగా ఉండరెందుకు?
పాపము చేయుటెందుకు?‖ తరములు ‖
Verse
క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు
ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి
పాపములో ఉన్న స్త్రీలను చూడు
వాక్యం విని పాపం మానివేసిరి‖ 2x ‖
దేవుని ఎరిగిన పిల్లల చూడు‖ 2x ‖
భయభక్తులు కలిగి బ్రతకరెందుకు?
దైవ వాక్యమును ఆచరించరెందుకు ?
దేవుని ఎరిగి ఉండిన.. దైవముగ మహిమపరచిన..
కన్న తండ్రి మనస్సు తెలిసిన.. ప్రియమైన పిల్లలు కావాలి
మనసులు మార్చుకోవాలి‖ తరములు ‖

Related Tags

RepentanceCorrectionSpiritual Growth