Verse
తీయని స్వరాలతో నా మనసే నిండెను
యేసుని వరాలతో నా బ్రతుకే మారెను
భావమధురిమ ఉప్పొంగెను
రాగసుధలతో భాసిల్లెను‖ 2x ‖
పరవశించి నిను స్తుతించి
ఘనపరచెద వైభవముగా‖ తీయని ‖
Verse
ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను
నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను
సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము
ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను
యేసుతో రాజ్యము చేసే భాగ్యము
నాకు దొరికె కనికరము – తనువు పరవశము‖ తీయని ‖
Verse
ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను
సహాయుడా నీలోనేగా నా సాఫల్యము
ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
యేసుని సన్నిధి చేరే భాగ్యము
నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము‖ తీయని ‖