Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thellaarindi Vela

తెల్లారింది వేళ

Thellaarindi Vela

Lyricist: Samuel Karmoji
Verse
అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా‖ 2x ‖
Verse
అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా‖ 2x ‖
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా‖ 2x ‖
మరచిపోవునా‖ తెల్లారింది Thellaarindi ‖
Verse
చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా‖ 2x ‖
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా‖ 2x ‖
నీకు తెలియునా‖ తెల్లారింది Thellaarindi ‖

Related Tags

PraiseCreationMorningChildren