Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thellavaarina Velaa Deli Vondi Mana

తెల్లవారిన వేళఁ దెలి వొంది మన

Thellavaarina Velaa Deli Vondi Mana

Lyricist: Purushothamu Choudari
Chorus
తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె
యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని
మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ‖ దెల్లవారిన వేళ ‖
Verse
నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్
భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు
మోడ్చి మ్రొక్కుచును‖ దెల్లవారిన వేళ ‖
Verse
భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ
బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ
డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్‖ దెల్లవారిన వేళ ‖
Verse
దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్
దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు
శుభమడుగుకొనుచున్‖ దెల్లవారిన వేళ ‖
Verse
పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత
నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ
తొలఁగించు మని వేఁడుకొనుచున్‖ దెల్లవారిన వేళ ‖

Related Tags

WorshipPrayerMorning