Verse
తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌను
నీవు వరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా
Verse
లోకములోన కష్టములెల్ల యేసుడు భరియించెన్
పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా
Verse
పాపిన్ రక్షింప ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండు
ఇది యెంతటి కరుణ నిరింతర ముండును స్తుతించుము ఓమనసా
Verse
అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్
నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా
Verse
కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే
తన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా
Verse
భూలోక వాసుల్ పరలోక వాసుల్ ప్రభువును స్తుతించుడి
యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు ఓ మనసా