Verse
తెరువబడియున్నది కృపద్వారము
త్వరపడి రమ్మని పిలిచె నేసు
Verse
ఎవరును నశియింప వలదని
ఓరిమి ప్రభువు వహియించును
మారు మనస్సును పొందు సమయమిదే
మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు
Verse
ద్వారము తెరువబడియుండగా
దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు
దీనిని నీవు అంగీకరించిన
దేవుని దీవెనలు పొందెదవు
Verse
రాత్రి గడచిపోయి పగలాయెను
అతిక్రమములను వీడుమనె ప్రభు
నీతి సూర్యుండు ఉదయించును
భీతిని విడచి సిద్ధపడుము
Verse
అర్థ రాత్రి వేళ గొప్ప సందడాయెను
అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు
సిద్ధముగా నున్నవారే వెళ్ళెదరుగా
ఆ ద్వారము మూయబడు త్వరపడుమా
Verse
వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను
యెసు రక్తమందు శుద్ధకావలెను
ఘనముగ మీరు ప్రవేశింపవలెను
మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే