Verse
తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు‖ 2x ‖
ఓహో సోదరా యేసే నీ గురి‖ 2x ‖
Verse
ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు‖ 2x ‖
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా‖ 2x ‖
Verse
విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును‖ 2x ‖
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు‖ 2x ‖