Verse
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన‖ 2x ‖
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును‖ 2x తొలకరి ‖
Verse
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును‖ 2x ‖
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును‖ 2x అది నూతన ‖
Verse
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును‖ 2x ‖
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును‖ 2x అది నూతన ‖