Chorus
తొలకరివాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్దాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన
అది నూతన పరిచి ఫలింప చేయును సంవృద్ధి
నిచ్చును సంతోష పరచును
Verse
ఎడారి వంటి బ్రతుకును సారముగ చేయును
జీవ జలముతో నింపి జీవింప చేయును‖ 2x ‖
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సంవృద్ధితో నింపును‖ 2x ‖
Verse
సత్య స్వరూపి సుద్ధత్మ నీలోవసించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితం మిచ్చును‖ 2x ‖
యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుతును‖ 2x ‖