Verse
తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా‖ 2x ‖
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు‖ 2x తూర్పు దిక్కు ‖
Verse
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా‖ 2x ‖
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా‖ 2x తూర్పు దిక్కు ‖
Verse
పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా‖ 2x ‖
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా‖ 2x తూర్పు దిక్కు ‖
Verse
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు‖ 2x ‖
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము‖ 2x తూర్పు దిక్కు ‖