Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thoorpu Nundi Padamaraku Entha Dooramo

తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో

Thoorpu Nundi Padamaraku Entha Dooramo

Chorus
తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో
అంత దూరం పోయెను నా పాప భారము
యేసు నన్ను తాకగానే తొలగిపోయెను
నా పాపము -నా పాప భారము‖ 2x ‖
Verse
రాతి వంటిది నాదు-పాత హృదయము
మెత్తనైన మాంసపు-హృదయమాయెను
ఎంత మధురము -నా యేసు రుధిరము
నా కలుష హృదయమును-కడిగి వేసెను‖ తూర్పు ‖
Verse
పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను
పరమ జీవమార్గమును-నాకు జూపెను
ఎంత రమ్యము -నా యేసు రాజ్యము
యుగ యుగాలు -అదే నాకు పరమభాగ్యము‖ తూర్పు ‖

Related Tags

GraceSalvationForgiveness