Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thoorupu Dikkuna Chukka Butte

తూరుపు దిక్కున చుక్క బుట్టె

Thoorupu Dikkuna Chukka Butte

Verse
తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె‖ 2x ‖
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె‖ 2x ‖
చల్లని రాతిరి కబురే తెచ్చె‖ 2x ‖
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు‖ 2x తూరుపు ‖
Verse
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము‖ 2x పుట్టినాడంట ‖
Verse
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు‖ 2x పుట్టినాడంట ‖
Verse
మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు‖ 2x పుట్టినాడంట ‖

Related Tags

Christmas