Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thraahi Maam Kreesthu Naadhadhayaojooda Raavae Naenudhaehi Yanuchu Nee

త్రాహి మాం క్రీస్తు నాధదయఁజూడ రావే నేనుదేహి యనుచు నీ

Thraahi Maam Kreesthu Naadhadhayaojooda Raavae Naenudhaehi Yanuchu Nee

Chorus
త్రాహి మాం క్రీస్తు నాధ-దయఁజూడ రావే = నేను-దేహి యనుచు నీ
పాదములే - దిక్కుగాఁ జేరితి నిపుడు‖ త్రాహి ‖
Verse
గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుఁడనై - రవ్వపాలై నే నెంతో - నెవ్వ
ఁబొందితిఁ - త్రవ్వుచున్న కొలఁదిఁ - పెరుఁగుఁ- దరగదు నా పాప రాశి
- యివ్విధమునఁ జెడిపోతినినే - నేమి సేతు నో‖ త్రాహి ‖
Verse
నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జాచిత్తముఁ బూని - చేయరాని
దుష్కర్మములు చేసినాఁడను = దయ్యాలరాజు చేతిలో ఁ - జేయి వేసి వాని
పనులఁ- జేయ సాగి నే నిబ్భంగిఁ - జెడిపపోయితి నే నయ్యయ్యయ్యొ‖ త్రాహి ‖
Verse
నిబ్బర మొక్కంచుకైన-నిజము రవ్వంతైన లేక- దబ్బర లాడుటకు
ము-త్తాత నైతిని= అబ్బురమైన ఘోర పా -పాంధకార కూపమందు -
దబ్బున బడిపోయినయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా‖ త్రాహి ‖

Related Tags

PrayerRepentanceConfession