Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Thraahimaam Kreesthu Naatha

త్రాహిమాం క్రీస్తు నాథ

Thraahimaam Kreesthu Naatha

Verse
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే
నేను – దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు‖ త్రాహిమాం ‖
Verse
గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో‖ త్రాహిమాం ‖
Verse
నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు – చేసినాడను
దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో‖ త్రాహిమాం ‖
Verse
నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము – త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా‖ త్రాహిమాం ‖
Verse
నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా‖ త్రాహిమాం ‖

Related Tags

PrayerRepentanceSalvation